ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

ఆర్థికశాఖపై సీఎం జగన్ సమీక్షా సమావేశం - \jagan

బడ్జెట్​కేటాయింపులపై ముఖ్యమంత్రి జగన్​ సమీక్ష నిర్వహించారు. ఎన్నికల హామీల అమలు కోసం నిధుల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం ఆదేశించారు.

finance minister meet cm

By

Published : Jul 4, 2019, 9:29 AM IST

Updated : Jul 4, 2019, 1:28 PM IST


తాడేపల్లిలోని క్యాంప్​ కార్యాలయంలో ఆర్థికశాఖపై ముఖ్యమంత్రి జగన్​ సమీక్షా సమావేశం నిర్వహించారు.బడ్జెట్‌ కూర్పు, పలు విభాగాలకు నిధుల కేటాయింపులపై సీఎం సూచనలు చేశారు. ఏయే రంగాలకు ఎన్ని నిధులు కేటాయించాలో జగన్​ సూచించారు.ఎన్నికల హామీల అమలు కోసం నిధుల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం ఆదేశించారు.బడ్జెట్‌ కేటాయింపుల్లో నవరత్నాల హామీ అమలుకు పెద్దపీట వేయాలని జగన్​ అన్నారు. పింఛన్లు పెంపు, రేషన్‌ దుకాణాల ద్వారా సన్నబియ్యం సరఫరాకు నిధులు పెంచాలని ఆదేశించారు. రైతులకు పెట్టుబడి సాయం, డ్వాక్రా రుణాల మాఫీకి నిధులు ఎక్కువగా కేటాయించాలని అన్నారు. అమ్మఒడి పథకం,గృహ నిర్మాణం, పేదల ఇంటి స్థలాలకు నిధులు ఎక్కువగా కేటాయించాలని.. ఉద్యోగుల వేతనాల పెంపు సహా ఇచ్చిన హామీల అమలుకు నిధులు కేటాయించాలని సీఎం ఆదేశించారు.

Last Updated : Jul 4, 2019, 1:28 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details