ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు సరఫరా చేసిన ధాన్యానికి రావాల్సిన డబ్బులను వెంటనే విడుదల చేయాలని కోరుతూ పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరంలో రైతులు ఆందోళనకు దిగారు. ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. ధాన్యం సరఫరా చేసి నెలలు గడుస్తున్నా పట్టించుకున్నవారు లేరని ధ్వజమెత్తారు. ప్రస్తుత పంటకు అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి పెట్టుబడి పెడుతున్నామని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.
'సొమ్ములు ఇచ్చి రైతులను ఆదుకోండి' - rastho roko
ధాన్యం అమ్మిన తమకు రావాల్సిన సొమ్ము విడుదల కాలేదని పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరంలోని రైతులు రోడ్డెక్కారు. న్యాయం చేయాలంటూ రాస్తారోకో నిర్వహించారు.
!['సొమ్ములు ఇచ్చి రైతులను ఆదుకోండి'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3674529-1060-3674529-1561584516333.jpg)
'సొమ్ములు ఇచ్చి రైతులను ఆదుకోండి'