ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

చిత్తూరు జిల్లాలో ఫ్యాన్​ గాలి హోరు - ap results

చిత్తూరు జిల్లా కుప్పంలో చంద్రబాబు విజయ బావుటా ఎగరేశారు. జిల్లాలో వైకాపా జోరు కొనసాగుతోంది. వైకాపా అభ్యర్థులు.. సత్యవేడు నియోజకవర్గంలో కె. అదిమూలం, పుంగనూరు అసెంబ్లీ స్థానంలో పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, మదనపల్లె స్థానంలో నవాజ్​ భాషా, నగరి అభ్యర్థి ఆర్కే.రోజాలు విజయం సాధించారు. వైకాపా 8 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. తెదేపా ఒక స్థానాన్ని కైవసం చేసుకుంది.

చిత్తూరు జిల్లాలో ఫ్యాన్​ గాలి హోరు

By

Published : May 23, 2019, 12:48 PM IST

Updated : May 24, 2019, 8:00 AM IST

  • కుప్పంలో తెదేపా అభ్యర్థి చంద్రబాబు నాయుడు విజయ బావుటా ఎగరేశారు.
  • చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థి కె. అదిమూలం విజయం సాధించారు.
  • మదనపల్లె స్థానంలో వైకాపా అభ్యర్థి ఎం. నవాజ్​ భాషా విజయం సాధించారు.
  • పుంగనూరులో వైకాపా అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెలుపు జెండా ఎగరేశారు.
  • నగరి స్థానంలో వైకాపా అభ్యర్థి రోజా విజయ దుందుభి మోగించారు.
  • చంద్రగిరి వైకాపా అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్​ రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
  • తిరుపతిలో వైకాపా అభ్యర్థి భూమ కరణాకర్​ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు.
  • పీలేరులో చింతల రామచంద్రారెడ్డి ఆధిక్యంలో ఉన్నారు.
  • పూతలపట్టులో వైకాపా అభ్యర్థి ఎం. బాబు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
  • చిత్తూరులో వైకాపా అభ్యర్థి జంగలపల్లి శ్రీనివాసులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
  • పలమనేరులో​ వైకాపా అభ్యర్థి ఎన్​. వెంకటేశ్​గౌడ ఆధిక్యంలో ఉన్నారు.
  • గంగాధర నెల్లూరులో వైకాపా అభ్యర్థి కె. నారాయణ స్వామి ముందంజలో ఉన్నారు.
  • శ్రీకాళహస్తిలో బియ్యపు మధసూదన రెడ్డి లీడింగ్​లో కొనసాగుతున్నారు.
  • తంబాళ్లపల్లెలో వైకాపా అభ్యర్థి పెద్దిరెడ్డి ద్వారకానాథ్​ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు.
Last Updated : May 24, 2019, 8:00 AM IST

ABOUT THE AUTHOR

...view details