ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

సోదరుడి కోసం సోదరి, తండ్రి కోసం కూతురు- ఎన్నికల ప్రచారాల్లో కుటుంబ సభ్యులు - గుంటూరు ఎన్నికల ప్రచారం

సోదరుడి గెలుపు కోసం సోదరి...తండ్రి విజయం కోసం కూతురు ఎన్నికల ప్రచారాల్లో భాగమయ్యారు. కార్యకర్తలతో కలిసి జోరుగా ప్రచారం చేస్తూ అభ్యర్థులకు సాయపడుతున్నారు. ఎంపీ గల్లా జయదేవ్ సోదరి రమాదేవి, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ కుమార్తె దివ్య ఎన్నికల ప్రచారాల్లో పాల్గొన్నారు.

ఎంపీ గల్లా జయదేవ్ సోదరి రమాదేవి, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ కుమార్తె దివ్య ఎన్నికల ప్రచారం

By

Published : Mar 24, 2019, 6:21 AM IST

ఎంపీ గల్లా జయదేవ్ సోదరి రమాదేవి, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ కుమార్తె దివ్య ఎన్నికల ప్రచారం
ఎన్నికల ప్రచారంలో తలమునలకైన అభ్యర్థులకు వారి కుటుంబ సభ్యుల నుంచి బాసట లభిస్తోంది. ఎన్నికలకు తక్కువ సమయం ఉండడం వలన అభ్యర్థులతో పాటు, వారి కుటుంబ సభ్యులు సైతం గ్రామాలలో ప్రచారం నిర్వహిస్తున్నారు. అభ్యర్థుల గెలుపు కోసం మహిళలు సైతం ప్రచార రంగంలోకి దిగుతున్నారు. గుంటూరు జిల్లా తెదేపా ఎంపీ అభ్యర్థి గల్లా జయదేవ్ సోదరి రమాదేవి, ప్రత్తిపాడు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి డొక్కా మాణిక్య వరప్రసాద్ కుమార్తె దివ్య.. కుటుంబ సభ్యులతో కలిసి గ్రామాలలో ప్రచారం నిర్వహిస్తూ అభ్యర్థులకు తమ వంతు సహకారం అందిస్తున్నారు.

గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొమ్మూరు పెద్దివారిపాలెం పరిసర గ్రామాలలో ఎంపీ గల్లా జయదేవ్ సోదరి రమాదేవి, తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి డొక్కా కుమార్తె దివ్య మహిళలతో కలిసి ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేశారు. అభ్యర్థులతో పాటు కుటుంబ సభ్యులు ప్రచారం చేయడం..గ్రామాలలో సందడి వాతావరణం కనిపిస్తోంది.

సీఎం చంద్రబాబు చేసిన అభివృద్ధి పనులు, ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే తిరిగి అధికారం అందిస్తాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details