'ఎక్స్‌క్యూజ్ మీ రాక్షసి...' అంటోన్న సిద్ధార్థ్! - ఎక్స్క్యూజ్మీ రాక్షసి సాంగ్
సందీప్ కిషన్ హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్న 'నిను వీడని నీడను నేనే' సినిమాలో.. నటుడు సిద్ధార్థ్ ఒక రొమాంటిక్ సాంగ్ పాడారు. 'ఎక్స్క్యూజ్మీ రాక్షసి...' అంటూ టాలెంట్ చూపించారు.
!['ఎక్స్‌క్యూజ్ మీ రాక్షసి...' అంటోన్న సిద్ధార్థ్!](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2648660-65-3a9c22bf-7242-41a5-a3b8-e3fe96aa16c5.jpg)
సందీప్ కిషన్ హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్న సినిమా 'నిను వీడని నీడను నేనే'. అన్యా సింగ్ హీరోయిన్. కార్తీక్ రాజు దర్శకుడు. ఈ సినిమాలో 'ఎక్స్‌క్యూజ్ మీ రాక్షసి...' అంటూ సాగే రొమాంటిక్ పాటను.. యువ కథానాయకుడుసిద్ధార్థ్ చేతపాడించారు. ఇటీవలేపాట రికార్డింగ్ పూర్తయింది. ఈ పాటకు సామ్రాట్ సాహిత్యం అందించారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్పతాకంపై నిర్మాణమవుతున్న ఈ చిత్రాన్నినిర్మాత అనిల్ సుంకర సమర్పిస్తుండగా.. దయా పన్నెం, సందీప్ కిషన్, విజి సుబ్రహ్మణ్యన్ నిర్మిస్తున్నారు.ఎస్.ఎస్. తమన్ సంగీతం అందించారు.