'మద్యం గొలుసు దుకాణాలను పూర్తిగా నియంత్రిస్తాం' - excise_minsiter
అధికారులతో ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణస్వామి సమావేశం అయ్యారు. ముందుగా మద్యం గొలుసు దుకాణాలను పూర్తిగా నియంత్రిస్తామని మంత్రి తెలిపారు. నాటుసారా విక్రయాలు అధికంగా జరుగుతున్నాయని అన్నారు. మద్యపాన నిషేధానికి అందరూ సహకరించాలని కోరారు.
minister
మద్యపాన నిషేధం అమలు ప్రక్రియలో భాగంగా ముందుగా బెల్ట్ షాపులను పూర్తిగా నియంత్రిస్తామనిఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణస్వామి చెప్పారు.నాటుసారా విక్రయాలు అధికంగా జరుగుతున్నాయన్న ఆయన..అమ్మకందారులు,ప్రజలకు అధికారులే కౌన్సిలింగ్ ఇవ్వాలని ఆదేశించారు.గీత కార్మికులను అన్ని విధాలా ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.మద్యపాన నిషేధానికి అన్ని పార్టీలు,ప్రజలు సహకరించాలన్న ఆయన...త్వరలో కొత్త పాలసీ తీసుకొస్తామని వెల్లడించారు.
Last Updated : Jun 15, 2019, 10:13 PM IST