డబ్బు కావాలనుకునే వారు పార్టీ మారుతారని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి అన్నారు. అనంతపురం జిల్లా నూతన ఎస్పీ సత్యయేసుబాబుని కలిసి ఆయన ఇవాళ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ... జిల్లాలో పోలీసుల పనితీరు బాగుందని.. తమ నియోజకవర్గం ప్రశాంతంగా ఉందన్నారు. ఈ విషయంలో పోలీసులను అభినందిస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లో ప్రశాంత వాతావరణం ఉందన్న ఆయన... తాను పార్టీ మారుతున్నట్లు వస్తోన్న వార్తలు అవాస్తమన్నారు. ఇటీవల తాడిపత్రి ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఒక ప్రజాప్రతినిధి ఆ విధంగా మాట్లాడటం సరికాదన్నారు. తన నియోజక వర్గ గ్రామాల్లో కార్యకర్తల దాడులు ఏమీ లేవన్నారు. ఐదేళ్లుగా ఒక్క ఎఫ్.ఐ.ఆర్ నమోదుకాలేదని స్పష్టం చేశారు.
ప్రశాంత వాతావరణంలో పల్లెలు..: జేసీ ప్రభాకర్ రెడ్డి - తాడిపత్రి
"నేను పార్టీ మారుతానని వస్తోన్న వార్తలు అవాస్తవం. కొందరు కావాలనే అసత్య ప్రచారం చేస్తోన్నారు. డబ్బు కావాలనుకునే వాళ్లే పార్టీ మారుతారు. తాడిపత్రి నియోజకవర్గంలోని పల్లెల్లో ప్రశాంత వాతావరణం ఉంది, కార్యకర్తల కొట్లాటలు లేవు" ---జేసీ ప్రభాకర్ రెడ్డి, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే
నా నియోజకవర్గంలో కార్యకర్తలపై దాడుల్లేవ్ : జేసీ ప్రభాకర్ రెడ్డి
ఇదీ చదవండి: తరగతి గదిలో విద్యార్థులపై కూలిన పైకప్పు!