ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

ఎన్నికలకు ముందే రైతుల ఖాతాలోకి డబ్బు - nidhi

కిసాన్​ సమ్మాన్​ నిధి పథకం కోసం అర్హులైన రైతులను గుర్తించే ప్రక్రియ అతిత్వరలో పూర్తవుతుందని తెలిపారు వ్యవసాయ మంత్రిత్వ శాఖ అధికారి.

ఎన్నికలకు ముందే రైతుల ఖాతాలోకి డబ్బు

By

Published : Feb 13, 2019, 7:19 PM IST

లోక్​సభ ఎన్నికలకు ముందే ప్రధాన మంత్రి కిసాన్​ సమ్మాన్​ నిధి పథకం కింద రెండు విడతలుగా రూ.4వేలను రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమైంది.

మధ్యంతర బడ్జెట్​లో ఈ పథకాన్ని ప్రకటించారు ఆర్థిక మంత్రి పీయూష్​ గోయల్​. ఏడాదికి ఒక్కో రైతుకు మూడు విడతల్లో రూ.6వేలను ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ఈ మొత్తాన్ని రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేస్తామని చెప్పారు. అయిదు ఎకరాల్లోపు భూమి ఉన్న 12కోట్ల మంది చిన్న,సన్నకారు రైతులు ఈ పథకం వల్ల లబ్ధి పొందుతారని చెప్పారు. మార్చిలోపు తొలి విడత డబ్బును రైతులకు అందజేస్తామని చెప్పారు.

"అర్హులైన రైతులను గుర్తించే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి. లబ్ధిదారుల జాబితా అతి త్వరలోనే సిద్ధమవుతుంది. ఆంధ్రప్రదేశ్​, కర్ణాటక, గుజరాత్​, మహారాష్ట్రతో పాటు మరికొన్ని రాష్ట్రాలు భూ రికార్డులను డిజిటలైజ్​ చేశాయి. తెలంగాణ, ఒడిశా, జార్ఖండ్​ రాష్ట్రాలు కిసాన్​ యోజన వంటి పథకాలను ఇప్పటికే ప్రకటించాయి. వారి వద్ద కూడా రైతుల సమాచారం ఉంటుంది. " - వ్యవసాయ మంత్రిత్వ శాఖ సీనియర్​ అధికారి

లోక్​సభ ఎన్నికలకు ముందే రెండు విడతలు అనగా రూ.4వేలను అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని అధికారి తెలిపారు. ఆర్థిక సంవత్సరం నుంచే ఈ పథకాన్ని ప్రారంభించినందున అమలుకు ఎన్నికల కోడ్​ అడ్డంకి కాదని వివరించారు.

లోక్​సభ ఎన్నికలు ఏప్రిల్​, మే నెలల్లో జరిగే అవకాశం ఉంది. వచ్చే నెలలో ఎప్పుడైనా ఎన్నికల కోడ్​ అమల్లోకి రావచ్చు.

ABOUT THE AUTHOR

...view details