శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలం మండ గ్రామంలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా గుంపుగా వచ్చిన ఏనుగులు గిరిజన మహిళలపై దాడిచేశాయి. ఈ ఘటనలో ఇద్దరు గిరిజన మహిళలు మృతి చెందారు. మండ పంచాయతీ ఈతమానుగూడ గ్రామ సమీపంలోని పొలాల్లో ఏనుగులు మహిళలపై దాడి చేశాయి. సవర గయ్యారమ్మ, పోడమ్మ ఏనుగుల గుంపు దాడిలో మృతి చెందారు. గయ్యారమ్మ అక్కడికక్కడే మృతి చెందగా... తీవ్రగాయాల పాలైన పోడమ్మను శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె కూడా మరణించింది.
ఏనుగుల గుంపు బీభత్సం... ఇద్దరు మృతి - women dead
శ్రీకాకుళం జిల్లాలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. పొలాల్లో పనిచేస్తోన్న ఇద్దరు మహిళలపై దాడిచేశాయి. ఈ దాడిలో ఒకరు అక్కడిక్కడే మృతి చెందగా.. మరొకరు ఆసుపత్రిలో మరణించారు.
పొలంలో పనిచేస్తోన్న మహిళలపై ఏనుగుల దాడి