కౌంటింగ్‌లో పాటించవలసిన నిబంధనలు, ఏవైనా సమస్యలు తలెత్తితే ఎలా వ్యవహరించాలన్న విషయాలపై అధికారులు చర్చించారు. ఓట్ల లెక్కింపు అనంతపురం పార్లమెంట్ స్థానానికి జె.ఎన్.టి.యులో, హిందూపురం స్థానానికి ఎస్కే యూనివర్శిటీలో కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు సంయుక్త కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. ఒక్కో కౌంటింగ్ హాల్లో 14 టేబుళ్లు ఏర్పాటు చేస్తామన్న ఆయన.. ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద ఒక సూపర్ వైజర్తో పాటు పరిశీలకులు ఉంటారని తెలిపారు. కౌంటింగ్‌కు ఈ నెల 22వ తేదీన ర్యాండమైజేషన్ చేసి సిబ్బంది నియామకం చేపడతామన్నారు.
'ఓట్ల లెక్కింపులో నిబంధనలు కచ్చితంగా పాటించాలి' - ఎన్నికలు
ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఎన్నికల కమిషన్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని..ఏవైనా ఉల్లంఘనలు జరిగితే చర్యలు తప్పవని అనంతపురం జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ వీరపాండియన్, సంయుక్త కలెక్టర్ ఢిల్లీరావు హెచ్చరించారు. అనంతపురం జె.ఎన్.టి.యు ఇంజనీరింగ్ కళాశాల ఆడిటోరియంలో కౌంటింగ్ సూపర్ వైజర్లు, అసిస్టెంట్లకు ఓట్ల లెక్కింపు ప్రక్రియపై అవగాహన సదస్సు నిర్వహించారు.
సంయుక్త కలెక్టర్ ఢిల్లీరావు
Last Updated : May 10, 2019, 11:58 AM IST