ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

వధూవరులకు కానుక...ఈనాడు పెళ్లిపందిరి వేదిక - వైజాగ్

విశాఖలో నిర్వహించిన ఈనాడు వివాహ పరిచయ వేదికకు మంచి స్పందన వచ్చిందని నిర్వాహకులు తెలిపారు. ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన వధూవరులు, వారి తల్లిదండ్రులు పరిచయ వేదికపై తమ వివరాలు తెలిపి సంబంధాలు కుదుర్చుకున్నారు.

ఈనాడు పెళ్లిపందిరి పరిచయం వేదిక

By

Published : Jun 2, 2019, 3:53 PM IST

ఈనాడు పెళ్లిపందిరి వేదిక

విశాఖ నగరంలో ఈనాడు పెళ్లి పందిరి ఆధ్వర్యంలో వధూవరుల వివాహ పరిచయ వేదిక కార్యక్రమం నిర్వహించారు. పెళ్లై విడిపోయిన వారి కోసం నిర్వహించిన ఈ వేదికకు...విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో వధూవరులు, వారి తల్లిదండ్రులు హాజరయ్యారు. పెళ్లై విడిపోయిన వారికి...మళ్లీ పెళ్లి సంబంధాలు కుదరడం కష్టతరం అవుతున్న ఈ రోజుల్లో ఈనాడు సంస్థ ఇలాంటి వివాహ పరిచయ వేదిక ఏర్పాటు చేయడం ఎంతో ఉపయోగకరంగా ఉందని వధూవరుల తల్లిదండ్రులు తెలిపారు. ఈనాడు సంస్థ ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details