ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

కస్తూరి రంగన్ కమిటీ నివేదికపై విద్యా నిపుణుల సదస్సు - కస్తూరి రంగన్ కమిటీ నివేదిక

విశాఖ పౌర గ్రంథాలయంలో జాతీయ విద్యా విధానం-2019(డాఫ్టు)పై విద్యా నిపుణుల సదస్సు జరిగింది. విశ్వ విద్యాలయ ఆచార్యులు, విద్యావేత్తలు ఈ సదస్సులో పాల్గొన్నారు. నూతన విద్యావిధానం వలన కలిగే మార్పులపై చర్చించారు.

కస్తూరి రంగన్ కమిటీ నివేదికపై విద్యా నిపుణుల సదస్సు

By

Published : Jun 22, 2019, 7:02 PM IST

కస్తూరి రంగన్ కమిటీ నివేదికపై విద్యా నిపుణుల సదస్సు

జాతీయ విద్యా విధానం-2019లో ప్రతిపాదించిన అంశాలు విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చేందుకు ఉపయోగపడతాయని విశాఖకు చెందిన ఆచార్యులు అభిప్రాయపడ్డారు. విశాఖ పౌర గ్రంథాలయం వేదికగా జాతీయ విద్యా విధానం 2019(కస్తూరి రంగన్ కమిటీ నివేదిక)పై సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో బోధన, పరిశోధన రంగాల్లో నూతన విద్యా విధానం అమలుతో గుణాత్మక మార్పులు వస్తాయనే అభిప్రాయం వ్యక్తమైంది.

విశాఖలోని పౌర గ్రంథాలయంలో సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ అండ్ డెవలప్​మెంట్​(సిడార్) ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో విశ్రాంత, ప్రస్తుత ఆచార్యులు పాల్గొన్నారు. పాఠశాల విద్య, కళాశాల విద్య, విశ్వవిద్యాలయ, అధ్యాపక పరిశోధన స్థాయిలలో ప్రమాణాలు పెంచే విధంగా కస్తూరి రంగన్ కమిటీ మే 31న కేంద్రానికి ఈ నూతన విద్యా విధానం డ్రాఫ్టు నివేదికను సమర్పించిందని వక్తలు తెలిపారు. ప్రస్తుతం దేశంలో కొన్ని రంగాల్లో మానవ వనరుల కొరత ఉందని, ఈ విద్యా విధానంలో సిఫార్సులను అమల్లోకి తీసుకువస్తే ఆ కొరతను తగ్గించుకోగలమని నిపుణులు అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి :'ఆధ్యాత్మిక ముసుగులో అక్రమాలు సరికావు'

ABOUT THE AUTHOR

...view details