ఎన్నికల కమిషన్ పరిధి దాటి వ్యవహరిస్తోందని వస్తోన్న ఆరోపణలపై ఈసీ ద్వివేది స్పందించారు. ఎన్నికల నిర్వహణకు ఇంటెలిజెన్స్‌తో సంబంధం ఉంటుందని స్పష్టం చేశారు. ఈసీ తీసుకునే నిర్ణయాలపై ఏవైనా అభ్యంతరాలుంటే కోర్టును ఆశ్రయించవచ్చని తెలియజేశారు.
నిఘా విభాగానికి ఎన్నికలతో సంబంధం లేదంటే ఎలా? - IPS
ఐపీఎస్ అధికారుల బదిలీలపై విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేది స్పందించారు. ఎన్నికల సిబ్బంది తరలింపు, శాంతి భద్రతలు ఇంటెలిజెన్స్‌తో ముడిపడి ఉంటాయని స్పష్టం చేశారు. ఈసీ నిర్ణయాలపై అభ్యంతరం ఉంటే కోర్టును ఆశ్రయించవచ్చని తెలిపారు.
'ఏపీ పరిణామాలను సీఈసీ నిశితంగా పరిశీలిస్తోంది. ప్రభుత్వ వ్యవహార శైలిపై సమాచారం సేకరిస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం నేరుగా ఈ అంశాన్ని పర్యవేక్షిస్తోంది. సీఎస్, డీజీపీ నుంచి వచ్చే వివరణలను వారికి అందజేస్తున్నాం. ఎన్నికల సిబ్బంది తరలింపు, శాంతిభద్రతలు, పోలీసుల కదలికలు ఇంటెలిజెన్స్‌తోనే ముడిపడి ఉంటాయి. వివేకా హత్య కేసులో నిఘా విభాగం సమాచారం సేకరించాలి కదా..!. కిడారి హత్య కేసులో ఇంటెలిజెన్స్ పని ఉండదా?. ఇంటెలిజెన్స్‌తో సంబంధం లేకుండా ఎన్నికలెలా నిర్వహిస్తాం..? వారు లేకుండా పోలీసు వ్యవస్థ ఉంటుందా?ఈసీ నిర్ణయాలపై అభ్యంతరం ఉంటే కోర్టును ఆశ్రయించవచ్చు. ఎన్నికల సంఘం తరపున రేపు హైకోర్టులో వాదనలు వినిపిస్తాం.'
-- గోపాల కృష్ణ ద్వివేది, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి.