వైకాపా ప్రభుత్వ నవరత్నాల హామీల్లో ఒకటైన మద్యపాన నిషేధాన్ని సమర్థంగా అమలు చేసేందుకు అన్ని వర్గాల ప్రజలు, పార్టీలు మద్దతు ఇవ్వాలని ఉపముఖ్యమంత్రి కె.నారాయణ స్వామి కోరారు. మద్యపానంతో కుటుంబాలు సర్వనాశనమవుతున్నాయన్న ఆయన...కాన్సర్లా పీడిస్తోన్న ఈ మహమ్మారిని నిషేధించాలన్నారు. పూర్తి మద్యపాన నిషేధమే ప్రభుత్వ లక్ష్యమని గుర్తుచేశారు. విడతల వారీగా చేపట్టే ఈ నిషేధంలో...ముందు బెల్టు షాపుల తొలగించడంపై దృష్టి పెట్టినట్లు నారాయణ స్వామి తెలిపారు. మద్యపాన నిషేధాన్ని కఠినంగా అమలు చేసేందుకు త్వరలో నూతన పాలసీ తీసుకువస్తామ వెల్లడించారు.
'మద్యపాన నిషేధానికి కట్టుబడి ఉన్నాం'
కుటుంబాలను నాశనం చేసే మద్యం మహమ్మారిని పూర్తిగా నిషేధించడమే వైకాపా ప్రభుత్వ లక్ష్యమని ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు. విడతల వారీగా చేపట్టే ఈ కార్యక్రమానికి ప్రజలు, పార్టీలు సహకరించాలని కోరారు.
ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి