ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

తుపాను ప్రభావిత 4 జిల్లాలు.. కోడ్ నుంచి మినహాయింపు - dwivedi_on_code_exem

ఫొని తుపాను ప్రభావిత 4 జిల్లాల్లో ఎన్నికల కోడ్‌ని ఎత్తేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. ఈ మేరకు ఉత్తరాంధ్ర మూడు జిల్లాలతో పాటు తూర్పుగోదావరి జిల్లాకు కోడ్‌ నుంచి మినహాయింపునిస్తూ సీఈసీ ఆదేశాలు జారీ చేసింది.

ec

By

Published : May 3, 2019, 7:50 PM IST

కోడ్ ఎత్తివేసిన జిల్లాలో సహాయచర్యలు చేపట్టండి

ఎన్నికల కోడ్ నుంచి మినహాయింపు ఇచ్చిన జిల్లాల్లో సహాయచర్యలు చేపట్టవచ్చని ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది తెలిపారు. ఈనెల ఆరో తేదీన మూడు జిల్లాల్లోని 5 కేంద్రాల్లో జరగనున్న రీపోలింగ్‌ ఏర్పాట్లపై.. ఆయా జిల్లాల అధికార్లతో సమీక్ష నిర్వహించారు. అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అటు కోడ్‌ ఉల్లంఘిస్తూ కడప జిల్లాలో 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్​' సినిమా ప్రదర్శించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ద్వివేది.. జాయింట్‌ కలెక్టర్‌పై చర్యలు తీసుకోవాలని సీఈసీకి సిఫారసు చేసినట్లు వెల్లడించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details