ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నివాసం వద్ద మరింత కట్టుదిట్టమైన భద్రత కోసం పోలీసులు డ్రోన్ కెమెరాలు ఏర్పాటు చేశారు. రోజుకు వివిధ ప్రాంతాల నుంచి వందల సంఖ్యలో అర్జీదారులు రావడం, ఒక్కోసారి ముఖ్యమంత్రి కాన్వాయ్ వెళ్లే సమయంలోనూ ఆందోళనకారులు నినాదాలు చేయడం తదితర అంశాలను దృష్టిలో పెట్టుకున్న పోలీసులు డ్రోన్ కెమెరాతో నిఘా చేస్తున్నారు. ముఖ్యమంత్రి నివాసం చుట్టూ 200 మీటర్ల ప్రాంతాన్ని డ్రోన్ పహారా పరిధిలోకి తెచ్చారు. ఏయే ప్రాంతాల్లో జనం ఉన్నారు, ట్రాఫిక్ ఎలా ఉంది? విధుల్లో పోలీసులు అప్రమత్తంగా ఉన్నారా అనే అంశాలను ఈ వ్యవస్థ నుంచి ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు.
సీఎం జగన్ నివాసం వద్ద విహంగ పహారా - సీఎం జగన్
సీఎం జగన్ భద్రత విషయంలో అధికారులు డ్రోన్ కెమెరాలతో నిఘా కాస్తున్నారు. ముఖ్యమంత్రి నివాసం చుట్టూ 200 మీటర్లు ఎత్తులో డ్రోన్లతో పహారా కాస్తూ ఎంటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తగా వ్యవహరిస్తున్నారు.
సీఎం జగన్ నివాసం వద్ద విహంగ పహారా