ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

దిల్లీలో మరో అగ్నిప్రమాదం - పేపర్​ మిల్లు దగ్ధం

దిల్లీ నరైనా పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం జరిగింది. పేపర్​ కార్డ్​ పరిశ్రమలో మంటలు చెలరేగాయి. వరుస అగ్ని ప్రమాదాలతో దిల్లీవాసులు భయాందోళనలకు గురవుతున్నారు.

పేపర్​ మిల్లు దగ్ధం

By

Published : Feb 14, 2019, 12:05 PM IST

పేపర్​ మిల్లు దగ్ధం
దిల్లీలో వరుసగా మూడో రోజూ భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నరైనా పారిశ్రామికవాడలోని ఓ పేపర్​ కార్డ్ పరిశ్రమలో ఇవాళ ఉదయం మంటలు చెలరేగాయి. తక్షణం స్పందించిన అగ్నిమాపకశాఖ 29 అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించింది. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడం ఊరట కలిగిస్తోంది.

మంగళవారం దిల్లీ కరోల్​బాగ్​లోని ఓ హోటల్లో జరిగిన అగ్నిప్రమాదంలో 17 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. బుధవారం పశ్చిమపురి ప్రాంతంలో చెలరేగిన మంటలు 250 గుడిసెలను ఆహుతి చేశాయి. దీంతో వరుస అగ్నిప్రమాదాలతో దిల్లీవాసులు బెంబేలెత్తిపోతున్నారు.

ABOUT THE AUTHOR

...view details