ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

దిల్లీ ఏసీబీపై కేంద్రానిదే అధికారం:సుప్రీం

కేంద్రం, దిల్లీ ప్రభుత్వం మధ్య అధికారాల పరిధి వివాదంపై సుప్రీంకోర్టు వైరుధ్య తీర్పు వెలువరించింది. సర్వీసుల విషయంలో న్యాయమూర్తుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఈ విషయాన్ని విస్తృత ధర్మాసనానికి నివేదించింది.

దిల్లీ ఏసీబీపై కేంద్రానిదే అధికారం:సుప్రీం

By

Published : Feb 14, 2019, 2:24 PM IST

అధికారాల విషయమై సర్వోన్నత న్యాయస్థానంలో దిల్లీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. అవినీతి నిరోధక శాఖ, విచారణ కమిషన్‌ వంటివి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ నియంత్రణలోనే ఉంటాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే సర్వీసులపై తీర్పులో ఏకాభిప్రాయం కుదరకపోవడం వల్ల ఆ విషయాన్ని విస్తృత ధర్మాసనానికి నివేదించింది.

కేంద్రం, దిల్లీ ప్రభుత్వం మధ్య అధికారాల పరిధిపై జస్టిస్​ సిక్రీ, జస్టిస్​ అశోక్ భూషణ్ ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. ఏసీబీ, విచారణ కమిషన్​ల ఏర్పాటు, విద్యుత్ ​బోర్డుల నియంత్రణ, భూ రెవిన్యూ సర్వీసులు, పబ్లిక్​ ప్రాసిక్యూటర్ల నియామకంపై ధర్మాసనం ఏకాభిప్రాయం వ్యక్తంచేసింది.

ఏసీబీ, విచారణ కమిషన్​ల ఏర్పాటు కేంద్రం పరిధిలోనూ, విద్యుత్​ బోర్డు, రెవిన్యూ, పబ్లిక్​ ప్రాసిక్యూటర్ల నియామకం దిల్లీ ప్రభుత్వ పరిధిలోనూ ఉంటాయని స్పష్టం చేసింది. అయితే సర్వీసుల విషయంలో ఇద్దరు న్యాయమూర్తుల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు.

సంయుక్త కార్యదర్శి, ఆ పైస్థాయి అధికారుల నియామకం కేంద్రం పరిధిలోకి వస్తుందని, మిగిలిన అధికారుల నియామకం దిల్లీ ప్రభుత్వమే చేపట్టాలని జస్టిస్ సిక్రీ తీర్పు వెలువరించారు. ఐతే జస్టిస్ భూషణ్​ దీనిపై విభేదించారు. అన్ని స్థాయిల అధికారులు కేంద్రం పరిధిలోకి వస్తారని తీర్పు చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని విస్తృత ధర్మాసనానికి నివేదించాలని నిర్ణయించారు.

తమ ఉద్యోగుల అవినీతిపై దిల్లీ ఏసీబీకి విచారణ చేసే అధికారం లేదన్న కేంద్రం నోటిఫికేషన్​ను సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది.

ABOUT THE AUTHOR

...view details