పోలవరం ప్రాజెక్టుకు అడ్డం కాదని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం.... దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానన్నట్లే ఉందని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఎద్దేవా చేశారు. అడుగడుగునా పోలవరంపై కేసులేస్తూ... ప్రాజెక్టుకు అడ్డం కాదని చెప్పడమేంటంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో ఒక్క జగన్ తప్ప.. ప్రజలంతా పోలవరాన్ని చూసి సంబరపడుతున్నారని మంత్రి చెప్పారు. మోదీ, జగన్, కేసీఆర్ కలిసి పోలవరాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని దేవినేని ఆరోపించారు. వెయ్యి కోట్ల రిటర్న్ గిఫ్ట్‌తో.. కేసీఆర్ చెప్పినట్లు జగన్ చేస్తున్నారంటూ దేవినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్, కేటీఆర్ కలిసి మైలవరానికి 100కోట్లు, మంగళగిరికి 200 కోట్లు పంపించారని తీవ్ర ఆరోపణలు చేశారు.
'కేసీఆర్ తీరు.. దళితుడిని సీఎం చేస్తానన్నట్టే ఉంది' - cm
పోలవరాన్ని చూసి జగన్ తప్ప రాష్ట్రంలో అందరూ సంబరపడుతున్నారని మంత్రి దేవినేని దుయ్యబట్టారు. మోదీ, కేసీఆర్, జగన్ కలిసి ప్రాజెక్టును అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.
!['కేసీఆర్ తీరు.. దళితుడిని సీఎం చేస్తానన్నట్టే ఉంది'](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2946111-thumbnail-3x2-devineni.jpg)
మంత్రి దేవినేని
కేసీఆర్‌కు జగన్ సామంతుడి మాదిరిగా తయారయ్యారు: దేవినేని
ఇక్కడ క్లిక్ చేయండి..'చంద్రబాబు, బాలకృష్ణకు మతిభ్రమించింది'..