రేపు విజయవాడకు దిల్లీ సీఎం కేజ్రీవాల్ - కేజ్రీవాల్
దిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ రేపు విజయవాడ రానున్నారు. సీఎం చంద్రబాబు ఆహ్వానం మేరకు విజయవాడ రానున్న ఆయన తెదేపా ప్రచార సభలో పాల్గొననున్నారు.
దిల్లీ సీఎం కేజ్రీవాల్
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రేపు విజయవాడ రానున్నారు. తెదేపాకు మద్దతుగా ఆప్ నేత ప్రచారం చేయనున్నారు. కేజ్రీవాల్ సీఎం చంద్రబాబుతో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు విజయవాడలో నిర్వహించే సభలో ఆయన పాల్గొంటారు. అనంతరం విజయవాడలోని 3 నియోజకవర్గాల పరిధిలో చంద్రబాబు,కేజ్రీవాల్ కలిసి రోడ్ షో నిర్వహిస్తారు.