కర్నూలు జిల్లా నంద్యాలలో క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.25 లక్షల 43 వేల నగదు, ఒక కమ్యూనికేటర్, 5 సెల్ ఫోన్లు, 2 ల్యాప్‌టాప్‌లు, ఒక ఎల్.ఈ.డి టీవీ స్వాధీనం చేసుకున్నారు.
నంద్యాలలో క్రికెట్ బెట్టింగ్ గ్యాంగ్ అరెస్టు - cricket betting
క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను నంద్యాల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి భారీగా నగదు, ఎలక్ట్రానిక్ వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.

నంద్యాలలో క్రికెట్ బెట్టింగ్ గ్యాంగ్ అరెస్టు...రూ.25 లక్షలు స్వాధీనం
నంద్యాలలో క్రికెట్ బెట్టింగ్ గ్యాంగ్ అరెస్టు...రూ.25 లక్షలు స్వాధీనం
గుంటూరు జిల్లా మాచర్లలోని నెహ్రూనగర్ చెందిన సిద్ధారెడ్డి, కర్నూలు జిల్లా సిరివెళ్ల మండలం మహాదేవపురంకు రాజేష్ కుమార్, నంద్యాల శ్యామనగర్కు చెందిన హారన్ బేగ్‌లు ముఠాగా ఏర్పడి బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు నంద్యాల డీఎస్పీ రాఘవేంద్ర తెలిపారు. ఐపీఎల్ మ్యాచ్‌ల సందర్భంగా నిందితులు బెట్టింగ్‌లు నిర్వహించినట్లు తెలిపారు.