ఈనెల 23న ఓట్ల లెక్కింపు దృష్ట్యా శాంతి భద్రతలపై విజయవాడలో సీపీ ద్వారకా తిరుమలరావు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ధనేకుల కళాశాల వద్ద భద్రత, ట్రాఫిక్ ఇబ్బందులున్నాయని అధికారులు ఆయనకు వివరించారు. కౌంటింగ్ కేంద్రం వద్ద పార్టీల వారీగా పార్కింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఫలితాల రోజు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఫలితాల తర్వాత విజయోత్సవ ర్యాలీలకు అనుమతి ఇవ్వకూడదని నిర్ణయించారు.
ఓట్ల లెక్కింపు నేపథ్యంలో సీపీ సమీక్ష
విజయవాడలో అధికారులతో సీపీ ద్వారకా తిరుమలరావు సమీక్ష నిర్వహించారు. ఫలితాల రోజు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నగరంలో పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని సూచించారు.
ఓట్ల లెక్కింపు నేపథ్యంలో సీపీ సమీక్ష