గృహ, వాహనాల కొనుగోలుకు సాధారణంగా బ్యాంకులు రుణాలు ఇస్తాయి. వినూత్నంగా వివాహలకు రుణాలందించే సదుపాయం తీసుకొచ్చింది విజయవాడ కోస్టల్ బ్యాంకు. పెళ్లి ఖర్చులకు అధిక వడ్డీకి అప్పులు చేయాల్సిన అవసరం లేకుండా... తక్కువ వడ్డీతో వివాహ ఖర్చులకు రుణం ఇస్తున్నట్లు కోస్టల్ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి చెప్పారు. కోస్టల్ కల్యాణమస్తు పేరిట రుణాలు కల్పిస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో తొలిసారిగా..వినూత్న పథకంతో రుణసదుపాయం కల్పిస్తున్నామని చెప్పారు. సామాన్య మధ్యతరగతి ప్రజలకు సౌలభ్యంగా రూ. 5 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు 14 నుంచి 15 శాతం వడ్డీతో రుణాలు అందిస్తున్నట్టు తెలిపారు. కోస్టల్ బ్యాంకు ఖాతాదారులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరారు. ఈ రుణాలను వధూవరులు, వారి తల్లిదండ్రులు, సోదరులు పొందవచ్చని తెలిపారు.
కోస్టల్ కల్యాణమస్తు... పెళ్లి ఖర్చులకూ రుణం!! - కల్యాణమస్తు
కోస్టల్ బ్యాంకు వినూత్న రుణ సదుపాయాన్ని ప్రారంభించింది. పెళ్లి ఖర్చులకు రుణాలను అందించేందుకు కోస్టల్ కల్యాణమస్తు అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. వివాహం కోసం రూ. 50 లక్షల వరకు రుణాలు అందిస్తున్నట్లు ఆ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ప్రకటించారు.
కోస్టల్ కల్యాణమస్తు...పెళ్లి ఖర్చులకు రుణం
ఇవీ చూడండి : ఇకపై సీబీఐ ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టొచ్చు!