కాంగ్రెస్ భాజపాలు రెండూ ప్రస్తుతం ఒకే బాణీని ఆలపిస్తున్నాయి. పరస్పర విరుద్ధ భావాలున్న పార్టీలు ఏకాభిప్రాయానికి రావడమేంటీ అనుకుంటున్నారా.! పాడేది ఒకే రాగం అయినా పలికే భావాలు మాత్రం వేరు. త్వరలో విడుదల కానున్న రణ్బీర్ కపూర్ చిత్రం గ్లలీబోయ్స్ చిత్రంలోని ఆయేగా పాటను ఆజాదీ అంటూ విమర్శలతో కూడిన సాహిత్యంతో విడియోలు చిత్రీకరించి మోదీపై కాంగీయులు, రాహుల్పై భాజపా విమర్శల దాడి చేస్తోంది.
కాంగ్రెస్ భాజపా 'ఆజాదీ' యుద్ధం.! - cong bjp
కాంగ్రెస్, భాజపాలు సామాజిక మాధ్యమాలు వేదికగా విమర్శనాస్త్రాలు సంధించుకుంటూ పోరాటానికి దిగాయి. ఇరు పార్టీలు గల్లీబోయ్స్ చిత్రంలోని ఆయేగా పాటను 'ఆజాదీ' అంటూ మార్చి చేసిన ట్వీట్లు వైరల్గా మారాయి.
![కాంగ్రెస్ భాజపా 'ఆజాదీ' యుద్ధం.!](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2407342-770-44e6d9fe-351a-46de-a211-50bc3b6aa507.jpg)
కాంగ్రెస్ భాజపా ఆజాదీ యుద్ధం