మండలి ప్రశాంతం
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గం, ఉభయగోదావరి, కృష్ణా గుంటూరు జిల్లాల్లో పట్టభద్రుల నియోజకవర్గానికి జరిగిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగోపాలకృష్ణ ద్వివేది తెలిపారు.ఈ తరహాలోనే సార్వత్రిక ఎన్నికల్లో స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రతిఒక్కరు సహకరించాలని ద్వివేది కోరారు.
తూర్పుగోదావరిలో 1,72,415 మంది, పశ్చిమగోదావరిలో 1,21,379 మంది పట్టభద్రులు ఓటు హక్కు కలిగివున్నారని,వారిలో 65 శాతం మంది సాయంత్రం 4 గంటల వరకు ఓటు హక్కును వినియోగించుకున్నట్టు ఆయన తెలిపారు. కృష్ణా జిల్లాలో 1,06,829 మంది, గుంటూరు జిల్లాలో 1,41,970 మంది పట్టభద్రులు ఓటుహక్కు కలిగి ఉన్నారు. వీరిలో 46 శాతం మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నట్టు ద్వివేది తెలిపారు. పలు కేంద్రాల్లో సాయంత్రం 7గంటల వరకూ పోలింగ్ జరిగిందనిఆయన అన్నారు. మండలి బరిలో 46 మంది ఉండడం వలన ప్రాధాన్య ఓటు నమోదులో జాప్యం జరిగిందని ద్వివేది తెలిపారు.