ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

సీఎం జగన్​ అధ్యక్షతన 24న కలెక్టర్ల సమావేశం

సచివాలయం 5వ బ్లాక్​లోని కాన్ఫరెన్స్​ హాలులో సీఎం జగన్​ అధ్యక్షతన జిల్లా కలెక్టర్ల సమావేశం ఈ నెల 24న జరగనుంది. అదే రోజు సాయంత్రం శాంతి భద్రతలపై ఎస్పీలతో చర్చించనున్నట్లు ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి మన్మోహన్​ సింగ్​ వెల్లడించారు.

సీఎం జగన్​ అధ్యక్షతన కలెక్టర్ల సమావేశం

By

Published : Jun 20, 2019, 9:40 PM IST

Updated : Jun 21, 2019, 12:16 AM IST

నవరత్నాల హామీల అమలే ప్రధాన అజెండాగా ఈ నెల 24వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన.. జిల్లా కలెక్టర్ల సమావేశం జరగనుంది. సచివాలయం 5వ బ్లాక్​లోని కాన్ఫరెన్స్ హాలులో సదస్సును నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్ సింగ్ తెలిపారు. పాలనలో పారదర్శకత, గ్రామ సచివాలయాలు, ఆరోగ్యం, ఇంటింటికీ నిత్యావసర సరుకుల పంపిణీ, పాఠశాల విద్యలో భాగంగా పుస్తకాలు, యూనిఫారాల పంపిణీ, వ్యవసాయం, కరవు, తాగునీరు తదితర అంశాలపై కలెక్టర్ల సమావేశంలో చర్చించనున్నట్లు వెల్లడించారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి కలెక్టర్ల సమావేశం ప్రారంభం కానుందని, సాయంత్రం ఎస్పీలతో శాంతి భద్రతలపై చర్చించనున్నట్లు తెలిపారు.

Last Updated : Jun 21, 2019, 12:16 AM IST

ABOUT THE AUTHOR

...view details