ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

6న గుంటూరు జిల్లాలోని 2 కేంద్రాల్లో రీపోలింగ్​ - ap elections 2019

గుంటూరు జిల్లాలో ఈ నెల 6వ తేదీన రెండు కేంద్రాల్లో రీపోలింగ్​ నిర్వహించనున్నట్లు కలెక్టర్​ కోన శశిధర్​ తెలిపారు. ఆయా రాజకీయ పార్టీ ప్రతినిధులతో రీపోలింగ్ విషయమై ఈరోజు ఆయన సమావేశమయ్యారు.

గుంటూరు జిల్లాలోని రెండు కేంద్రాల్లో రీపోలింగ్​

By

Published : May 2, 2019, 9:39 PM IST

ఈనెల 6వ తేదిన రెండు కేంద్రాల్లో రీ పోలింగ్
గుంటూరు జిల్లాలోని 2 కేంద్రాల్లో సార్వత్రిక ఎన్నికల రీ పోలింగ్​కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈనెల 6న రీ పోలింగ్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ కోన శశిధర్ వెల్లడించారు. ఆయా రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. రీపోలింగ్ కోసం తాము పంపిన ప్రతిపాదనలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపిందన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నల్లచెరువులోని 244 పోలింగ్ బూత్, నర్సరావుపేట నియోజకవర్గం కేశానుపల్లిలోని 94వ పోలింగ్ కేంద్రంలో మళ్లీ ఎన్నిక జరుగుతుందని తెలిపారు. ఈనెల 6వ తేది ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకూ ఓటింగ్​ పక్రియ కొనసాగుతుందన్నారు. భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. ఆయా నియోజకవర్గాల్లో రీపోలింగ్​ నిర్వహించాలని.. ఎంపీ గల్లాజయదేవ్​ గతంలో ఫిర్యాదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details