సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ఆంధ్రులు సత్తా చాటడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. వారికి అభినందనలు తెలియజేశారు. దేశానికి అత్యున్నత స్థాయి అధికారులను అందిస్తున్న ఘనత తెలుగువారిదేనని కొనియాడారు. తెలుగు సంవత్సరాది వేళ తెలుగు యువత సాధించిన విజయాలు తోటివారికి ప్రేరణ ఇస్తున్నాయన్నారు. సివిల్స్కు ఎంపికైన వారిలో 40 మంది తెలుగువారే కావడం గర్వకారణమని, జాతీయస్థాయిలో తొలి 100 ర్యాంకులలో ఐదుగురు మనవారే నిలబడటం విశేషమని ప్రశంసించారు. అఖిల భారత సర్వీసులకు ఎంపికైన యువతీ యువకుల్ని అమరావతికి ఆహ్వానించి తగురీతిలో సత్కరించాలని అధికారులకు సూచించారు.
ఉగాది వేళ.. తెలుగు యువత విజయాలు గర్వకారణం - చంద్రబాబు
సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో సత్తా చాటిన తెలుగు తేజాలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభినందనలు తెలియజేశారు. దేశానికి అత్యున్నత స్థాయి అధికారులను అందిస్తున్న ఘనత తెలుగువారిదేనని కొనియాడారు.
చంద్రబాబునాయుడు