ఏకపక్షంగానే ఎన్నికల సంఘం: చంద్రబాబు - ఏకపక్షంగానే ఎన్నికల సంఘం: చంద్రబాబు
ఎన్నికల సంఘం ఏకపక్ష వైఖరిపై ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి విరుచుకుపడ్డారు. ఎన్నికల సంఘం చిత్తశుద్ధి సందేహాస్పదంగా ఉందన్న ఆయన... బంగాల్‌లో భాజపా నేతలు, అమిత్ షా ఫిర్యాదులపై ఈసీ తక్షణమే స్పందిస్తోందని, తృణముల్ నేతల ఫిర్యాదులు మాత్రం పట్టించుకోవడం లేదని ట్వీట్ చేశారు.
ఈసీ ఏకపక్ష వైఖరితో వ్యవహరిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. బంగాల్‌లో భాజపా నేతలు, అమిత్ షా ఫిర్యాదులపై ఈసీ తక్షణమే స్పందిస్తోందని, తృణముల్ నేతల ఫిర్యాదులు మాత్రం పట్టించుకోవడం లేదని ట్వీట్టర్ వేదికగా అసహనం వ్యక్తం చేశారు. మోదీకి పదేపదే క్లీన్‌చిట్‌లు ఇస్తూ... భాజపా తప్పుడు ఫిర్యాదులపై వెంటనే స్పందిస్తోందని ఆరోపించారు. ప్రతిపక్షం చేసిన ఫిర్యాదులపై కూడా స్పందించి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తన అధికారాలను వినియోగించి, ఎన్నికల సంఘం విశ్వసనీయతను నిరూపించుకోవాలని సూచించారు.