ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

మోదీని ఉద్దేశించే..అడ్వాణీ చేసిన వ్యాఖ్యలు : సీఎం

భాజపాను వ్యతిరేకించడమంటే దేశాన్ని వ్యతిరేకించినట్లు కాదని.. భాజపా అగ్రనేత అడ్వాణీ చేసిన వ్యాఖ్యలు.. ప్రధాని మోదీని ఉద్దేశించినవేనని.. ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అడ్వాణీ తన బ్లాగులో పేర్కొన్న అంశాలపై ట్విట్టర్‌లో స్పందించిన సీఎం.. వాక్ స్వాతంత్య్రం, భిన్నత్వంలో ఏకత్వం, భారతీయ సమాజానికి వారసత్వ మూలాలని అభిప్రాయపడ్డారు.

By

Published : Apr 5, 2019, 10:37 AM IST

cm

భాజపాను వ్యతిరేకించడమంటే దేశాన్ని వ్యతిరేకించినట్లు కాదని ..భాజపా అగ్రనేత అడ్వాణీ చేసిన వ్యాఖ్యలు..ప్రధాని మోదీని ఉద్దేశించినవేనని..ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.అడ్వాణీ తన బ్లాగులో పేర్కొన్న అంశాలపై ట్విట్టర్‌లో స్పందించిన సీఎం..వాక్ స్వతంత్య్రం,భిన్నత్వంలో ఏకత్వం,భారతీయ సమాజానికి వారసత్వ మూలాలని అభిప్రాయపడ్డారు.గతం నుంచి నేర్చుకుంటూ,ఆత్మావలోకనం చేసుకుంటూ,భవిష్యత్తు వైపు చూడాలన్నారు.జాతీయవాదం అంటే మన వైవిధ్యాలన్నిటినీ కాపాడుకుంటూ,ప్రజాస్వామ్యం వారసత్వ పునాదుల్ని బలపరచటమేనని తెలిపారు.విభేదించిన వారిని, ప్రత్యర్థులను,శత్రువులలాగా చూడటం కాదని స్పష్టంచేశారు.రాష్ట్రానికి నమ్మక ద్రోహం చెయ్యడమే కాకుండా,కుట్రలతో దాడులు చేస్తున్నారని సీఎం మండిపడ్డారు. మోదీ, షా తనస్వార్ధం కోసం దేశాన్నీ నాశనం చేసే పరిస్థితి ఏర్పడుతోందని చంద్రబాబు ఆవేదన వ్యక్తంచేశారు.ప్రజాస్వామ్య విలువలు తెలియని వ్యక్తి చేతిలో దేశ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందినే విషయాన్ని తాను ఎప్పట్నుంచో చెప్తున్నానని,అదే విషయాన్ని ఇప్పుడు అడ్వాణీ సున్నితంగా చెప్పారని సీఎం అన్నారు .

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details