ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

'దేశానికి, ప్రజాస్వామ్యానికి మోదీ తీరని ద్రోహం చేశారు' - CM TWEET

ప్రధాని మోదీ రాజమండ్రి పర్యటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లిని చంపి బిడ్డను బ్రతికించారంటూ ట్వీట్ చేశారు. ప్రత్యేక హోదాతో ఆంధ్రప్రదేశ్ ను ఆదుకుంటామని తిరుపతి వెంకన్న సాక్షిగా చెప్పిన మాటలు ఏమయ్యాయని మోదీని ప్రశ్నించారు.

BABU

By

Published : Apr 1, 2019, 12:47 PM IST

ప్రధాని మోదీపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ట్విటర్ వేదికగా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.రాజధానిని విశ్వనగరంగా అభివృద్ధి చేస్తామని మట్టి నీరు ముఖాన కొట్టినవారికి... రాష్ట్రం గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. నల్లధనాన్ని విదేశాల నుంచి వెనక్కు తెస్తామని హామీలు ఇచ్చి, ఆర్ధిక నేరస్తులతో అంటకాగారని ఆరోపించారు. లక్ష కోట్లప్రజాధనాన్ని అపహరించినవారికి అభయమిస్తున్నారని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలన్నిటినీ ఒక్కొక్కటిగా కూలుస్తూ దేశానికి, ప్రజాస్వామ్యానికీ, తీరని ద్రోహం చేస్తున్నారని వ్యాఖ్యానించారు.మోదీ దుర్మార్గపు పరిపాలనకు... ముగింపు పలకాలని దేశ ప్రజలు స్థిర నిశ్చయంతో ఉన్నారన్నారు. రాష్ట్ర ప్రజలు కేంద్రంలో అధికార మార్పును కోరుకుంటున్నారని చంద్రబాబు స్పష్టం చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details