కష్టపడి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని..గొడవలు ఎందుకనేది తన తత్వమని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.పార్టీ నేతలతోటెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన..ఏపీపై కేసీఆర్ పెత్తనం చేద్దామని చూస్తుంటే ఉరుకుంటామా?అని ప్రశ్నించారు.ఆంధ్రావాళ్లూతనకు ఊడిగం చేయాలన్న రీతిలో కేసీఆర్ కుట్రలు పన్నుతుంటే సహించొద్దని సూచించారు.కేసీఆర్‌తో కలిస్తే తప్పేంటని జగన్ వ్యాఖ్యలపై సీఎం స్పందించారు.
దొంగ వస్తున్నాడు జాగ్రత్త... చంద్రబాబు కొత్త నినాదం - CM TELE
ఏపీపై కేసీఆర్ పెత్తనం చేద్దామని చూస్తుంటే ఉరుకుంటామా? అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం... జగన్, కేసీఆర్ కుట్ర రాజకీయాలు చేస్తున్నరని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆంధ్రావాళ్లూ తనకు ఊడిగం చేయాలన్న రీతిలో ఈ కుట్రలు సాగుతుంటే సహించబోమని హెచ్చరించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు
జగన్ మాటలను బట్టే వ్యక్తిత్వం ఏంటో అర్థమవుతోందన్నారు.అవకాశవాదం,వితండవాదంతో జగన్ తన బలహీనతలన్నీ బహిర్గతం చేసుకుంటున్నారన్నారు.దొంగ వస్తున్నారు జాగ్రత్త అనే నినాదం ప్రజల్లోకి బలంగా వెళ్తోందని తెలిపారు.కేసీఆర్‌తో జగన్ కుమ్మక్కును నిరసిస్తూ తోచినవిధంగా నిరసనలు తెలపండని పార్టీ నేతలకు సీఎం సూచించారు.కేసీఆర్ దయాదాక్షిణ్యాలతో బతికేపరిస్థితి తెచ్చుకుందామా?అని ప్రశ్నించారు.ఎన్నికల యుద్ధంలో దోపిడీ దొంగలకు గట్టిగా బుద్ధి చెప్పాలన్నారు.
Last Updated : Mar 26, 2019, 12:44 PM IST
TAGGED:
CM TELE