జగన్‌కు బుద్ధి చెప్పండి..!
తెలంగాణ నుంచి రాష్ట్రానికి లక్ష కోట్లు రావాలి!
ఎన్టీఆర్ వైద్యసేవ ద్వారా 5 లక్షల రూపాయలు ఇచ్చి.. ప్రజల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తామని తెదేపా అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో ఎన్నికల ప్రచారం చేసిన ఆయన.. రాష్ట్ర ఆడపడుచులకు ఎల్లప్పుడూ పసుపు - కుంకుమ పథకంతో అండగా ఉంటామని భరోసా కల్పించారు.
రాష్ట్రానికి 15 లక్షల కోట్ల రూపాయల విలువైనపెట్టుబడులు వచ్చాయని ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తు చేశారు.పరిశ్రమలన్నీ పూర్తయితే 30 లక్షల ఉద్యోగాలు వస్తాయని స్పష్టం చేశారు.పింఛన్‌ను 2 వేల నుంచి 3 వేల రూపాయలు చేస్తానని మరోమారు వెల్లడించారు. వైకాపా అధినేతనేతజగన్ను నమ్ముకుంటే.. అందరినీ జైలుకు తీసుకువెళ్తారని విమర్శించారు. తెలంగాణ నుంచి రాష్ట్ర వాటాగా కనీసం లక్ష కోట్ల రూపాయలురావాలని చెప్పారు. ఏపీ వాటా చెల్లించకుండా.. ఎగ్గొట్టేందుకే కేసీఆర్ కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. అలాంటికేసీఆర్తో లాలూచీ పడిన జగన్ కు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని చంద్రబాబు కోరారు.
ఇవి కూడా చదవండి:సర్వేపల్లిలో గెలుపు జెండా ఎగరేస్తా: సోమిరెడ్డి