ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

'వెనుకబడిన వర్గాలకు ప్రత్యేక బ్యాంకు సేవలు' - modi

వెనుకబడిన ప్రాంతాల ప్రజల ఆర్థికాభివృద్ధి కోసం ప్రత్యేక బ్యాంకు ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. జగన్​కు ఓటేస్తే రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిన మోదీకి ఓటేసినట్లేనని..పత్తికొండ రోడ్​ షోలో ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు.

'వెనుకబడిన వర్గాలకు ప్రత్యేక బ్యాంకు సేవలు అందిస్తాం'

By

Published : Mar 27, 2019, 7:15 PM IST

పత్తికొండ రోడ్​ షోలో ముఖ్యమంత్రి
కర్నూలు జిల్లా పత్తికొండలో సీఎం చంద్రబాబు రోడ్​షోలో పాల్గొన్నారు. వెనుకబడిన వర్గాల ఆర్థికాభివృద్ధి కోసం నియోజకవర్గంలో ప్రత్యేక బ్యాంకు ఏర్పాటు చేస్తామని సీఎం ప్రకటించారు. ఎంతో కాలంగా వైరుధ్యంలో ఉన్న కోట్ల..కేఈ కుటుంబాలు ఇకపై అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తాయన్నారు. తెదేపాకు కంచకోటగా ఉన్న పత్తికొండ ప్రజలు... కర్నూలు పార్లమెంట్​ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాశ్​ రెడ్డి, అసెంబ్లీ అభ్యర్థి కే.ఈ శ్యామ్​బాబును గెలిపించాలని కోరారు. ప్రతిపక్ష నేత జగన్​కు ఓటేస్తే మోదీకి వేసినట్లేనని పేర్కొన్నారు. కేసీఆర్​ వైకాపాకు మద్ధతిస్తూ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. మరోసారి తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని ఆకాంక్షించారు.

ABOUT THE AUTHOR

...view details