'తెదేపా 37 వసంతాలు పూర్తి చేసుకుంది. ప్రజల హృదయాల్లో ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆయన స్ఫూర్తితో ఆర్థిక అసమానతలు తగ్గించే దిశగా కృషి చేస్తున్నాం. పండగల సమయంలో కానుకలు ఇచ్చాం. పసుపు - కుంకుమ పథకంతో మహిళల్లో ఆత్మస్థైర్యాన్ని నింపాం. పింఛన్లు 200 నుంచి 2 వేల రూపాయలకు పెంచాం. భవిష్యత్తులో 3 వేలకు పెంచుతామని ఎన్టీఆర్ సాక్షిగా హామీ ఇస్తున్నా. నదుల అనుసంధానంతో నీటి కొరతను అధిగమించాం. రైతులకు 24వేల 500 కోట్లు రుణ మాఫీ చేశాం. అలాంటి పార్టీని మళ్లీ ఆశీర్వదించండి.'
-- గుడివాడ రోడ్ షోలో సీఎం చంద్రబాబు
'ఎన్టీఆర్ సాక్షిగా.. అభివృద్ధికి కట్టుబడి ఉన్నా'
తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు ఎన్నో కష్టానష్టాలకోర్చి ఎన్టీఆర్ తెదేపాను స్థాపించారని..గుడివాడ రోడ్ షోలో చంద్రబాబు అన్నారు. ఆ మహానుభావుని స్ఫూర్తితో 37 సంవత్సరాల నుంచి.. ఎన్ని ఇబ్బందులున్నా పేదల సంక్షేమానికి అహర్నిశలు పాటుపడుతున్నామన్నారు.
గుడివాడ రోడ్ షోలో చంద్రబాబు
Last Updated : Mar 29, 2019, 11:33 PM IST