అన్నదాత-సుఖీభవ పథకం రద్దు - cm review
అన్నదాతల కోసం కొత్తగా 'రైతు భరోసా' పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. రైతులకు 12 వేల 500 రూపాయలు ఇచ్చే రైతు భరోసా కార్యక్రమాన్ని అక్టోబరు 15 నుంచి ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. గత ప్రభుత్వం అమలుచేసిన 'అన్నదాత సుఖీభవ' పథకాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. వ్యవసాయం, అనుబంధ రంగాలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు.
cm
అన్నదాత సుఖీభవ పథకం రద్దు చేస్తూ...కొత్తగా రైతుభరోసా పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది.ఈ పథకం కింద అన్నదాతలకు ప్రభుత్వం12వేల500రూపాయలు ఇవ్వనుంది.అక్టోబరు15నుంచి పథకాన్ని ప్రారంభిస్తామని సీఎం ప్రకటించారు.రైతులకు కనీస మద్దతు ధర అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. 3వేల కోట్ల రూపాయలతో మార్కెట్ స్థిరీకరణ నిధిని బడ్జెట్‌లో పెడతామని,రైతులకు నష్టం కలగకుండా ఈ నిధి ద్వారా ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం జగన్ తెలిపారు.
Last Updated : Jun 6, 2019, 2:48 PM IST