రాష్ట్ర వరప్రదాయిని పోలవరం ప్రాజెక్టు పనులు 69 శాతం పూర్తయ్యాయని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. కాఫర్ డ్యామ్‌లో 49 లక్షల క్యూబిక్ మీటర్ల పని పూర్తికావాలన్నారు. తవ్వకం పనులు ఇంకా 15 శాతం పూర్తవ్వాలని.. కాంక్రీట్ పనులు ఇంకా 15.5 శాతం పూర్తవ్వాలని చెప్పారు. ఎగువ కాఫర్ డ్యామ్ ఇంకా 40 లక్షల క్యూబిక్ మీటర్లు పూర్తవ్వాలన్న ముఖ్యమంత్రి... డయాఫ్రం వాల్ వంద శాతం పూర్తయ్యిందన్నారు.
''జులై 15లోగా ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు పూర్తవ్వాలి. కాఫర్ డ్యాముల్లో ఇంకా 30 లక్షల క్యూబిక్ మీటర్ల పని ఉంది. పోలవరానికి కేంద్రం ఇంకా 4 వేల 508 కోట్ల రూపాయలు ఇవ్వాలి. ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్రం తరపున 16 వేల 371 కోట్లు ఖర్చు పెట్టాం. ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం అనేక ఇబ్బందులు పెట్టింది. నిర్వాసితులకు రాష్ట్రం నుంచి అదనపు సాయం చేస్తున్నాం. నిర్వాసితులకు అన్నిరకాల మౌలిక వసతులు కల్పిస్తున్నాం. పోలవరం పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి'' - చంద్రబాబు, ముఖ్యమంత్రి
కేంద్రం నిధులు ఇవ్వలేదని ప్రాజెక్టు ఆగదు!