మంగళగిరి హ్యాపీరిసార్ట్స్లో రెండు రోజుల విరామం తర్వాత మళ్లీ పార్లమెంట్ నియోజకవర్గ సమీక్షలను చంద్రబాబు ప్రారంభించారు.శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని అన్ని శాసనసనభ నియోజకవర్గాల నేతల సమావేశంతో పాటు....ఇచ్ఛాపురం,పలాస శాసనసభ పరిధిలోని అభ్యర్ధులు,నేతల భేటీలో చంద్రబాబు ప్రసంగించారు.ప్రతి కార్యకర్తా రాజకీయాలను అధ్యయనం చేసే స్థాయికి చేరాలని అభిలషించారు. 37ఏళ్లుగా రాజకీయాలు చేస్తున్న వారంతా మరింతగా రాణించాలని ఆకాంక్షించారు.రాష్ట్రానికి న్యాయం కోసమే తెలుగుదేశం పార్టీ ధర్మపోరాటం చేసిందని వివరించారు.
ఐదేళ్లలో ఏం చేశారు?
26ఏళ్ల క్రితం చనిపోయిన రాజీవ్‌గాంధీ గురించి మాట్లాడుతున్నారన్న సీఎం..ఐదేళ్లలో దేశానికి ఏం చేశారో నరేంద్రమోదీ చెప్పాలని ప్రశ్నించారు.మోదీ వల్ల భారత రాజకీయాల్లో హుందాతనం కొరవడిందని ఆవేదన వ్యక్తం చేశారు.తెలుగుదేశంతో పెట్టుకున్నప్పుడే నరేంద్రమోదీ పతనం ప్రారంభమైందని వ్యాఖ్యానించారు.రాష్ట్రం కోసమే భాజపాపై మనం తిరగబడ్డామన్న చంద్రబాబు..ప్రత్యర్థులపై ఈడీ, ఐటీ ద్వారా కక్షసాధింపు చర్యలు గతంలో లేవని పేర్కొన్నారు.