రాష్ట్రంలోని ఆశా వర్కర్లకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీపి కబురు చెప్పారు. పాదయాత్రలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ వారి జీతాలను భారీగా పెంచారు. ఆశావర్కర్ల జీతాలను పది వేల రూపాయలకు పెంచుతున్నట్టు జగన్ ప్రకటించారు.
వైద్య ఆరోగ్య శాఖపై ఇవాళ తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సమీక్ష చేపట్టిన వైఎస్ జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి నిర్ణయంతో ఆశావర్కర్ల జీతాలు రూ.10 వేలకు పెరిగింది. ప్రస్తుతం మూడు వేల రూపాయల వేతనం అందుకుంటున్న ఆశావర్కర్లు.. ఇకపై పదివేల రూపాయల వేతనం అందుకోనున్నారు. గ్రామీణ స్థాయిలో ఆశావర్కర్ల ప్రాధాన్యతను గుర్తించిన ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.