ప్రజావేదిక కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విద్యా శాఖపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో నిరక్షరాస్యత (33%) జాతీయ నిరక్షరాస్యత (25.96%) సగటు కన్నా ఎక్కువగా ఉందన్నారు. అక్షరాస్యత శాతం పెంచేందుకే అమ్మ ఒడి పథకం తెస్తున్నామన్నారు. ప్రభుత్వానికి విద్యావ్యవస్థ అత్యంత ప్రాధాన్యమైన రంగాల్లో ఒకటని సీఎం స్పష్టం చేశారు. పాఠశాల ఫొటోలు తీసి... ప్రస్తుతానికి భవిష్యత్తుకి తేడా ఉండేలా అభివృద్ధి చేస్తామని చెప్పారు. అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
ప్రతి పాఠశాలను ఆంగ్లమాధ్యమ స్కూలుగా మారుస్తామనీ... తెలుగును తప్పనిసరి పాఠ్యాంశంగా చేస్తామనీ ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. విద్యార్థులకు ఏకరూప దుస్తులు, పుస్తకాలు, షూ అన్నీ సకాలంలో అందించేలా ప్రణాళికలు చేపడతామన్నారు. గత ప్రభుత్వం మాదిరిగా స్కూలు యూనిఫామ్‌లలో స్కామ్‌లు జరగకూడదని అధికారులకు దిశానిర్దేశం చేశారు. మధ్యాహ్న భోజనంలో నాణ్యత పెంచుతామని సీఎం తెలిపారు.
విద్యా హక్కు చట్టం అమలు