సమీక్ష ముగిసింది.. 'అంచనాల'పై ఆదేశం వెళ్లింది! - ముఖ్యమంత్రి సమీక్ష
రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. సాగునీటి ప్రాజెక్టుల అంచనాలపై అధ్యయనం చేయాలని ఇంజినీరింగ్ నిపుణులను ఆదేశించారు. 15 రోజుల్లో నిపుణుల కమిటీతో సీఎం జగన్ మరోసారి సమావేశం కానున్నారు.

గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన ఇంజినీరింగ్ పనులపై నిపుణుల కమిటీతో ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు.కమిటీ ఏర్పాటైన తర్వాత తొలిసారి భేటీ నిర్వహించిన ముఖ్యమంత్రి..సాగునీటి ప్రాజెక్టుల అంచనాలపై అధ్యయనం చేయాలని ఆదేశించారు.జలవనరులతో పాటు రహదారులు భవనాల శాఖ...మున్సిపల్, సీఆర్డీఏశాఖలోని కాంట్రాక్టులపైనా అధ్యయనం చేయాలని సీఎం సూచించారు.ప్రాజెక్టుల వారిగా పూర్తి వివరాలతో వచ్చే సమావేశానికి రావాలని నిపుణుల కమిటీకి స్పష్టం చేశారు. 15రోజుల్లో నిపుణుల కమిటీతో సీఎం జగన్ మరోసారి సమావేశం కానున్నారు.