ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

పారిశుద్ధ్య కార్మికులకు భారీగా వేతనాల పెంపు - prajavedika

కలెక్టర్లతో సీఎం జగన్ మొదటి రోజు సదస్సు ముగిసింది. పలు అంశాలపై సమీక్షలో భాగంగా.. సీఎం కీలక సూచనలు చేశారు. నవరత్నాల హామీల అమలును.. కలెకర్లు బాధ్యతగా తీసుకోవాలని చెప్పారు. పారిశుద్ధ్య కార్మికులకు భారీగా వేతనాలు పెంచారు. మంగళవారం ఉదయం 10 గంటలకు ఆరోగ్యం, స్త్రీ శిశు సంక్షేమం, రహదారులు, పంచాయతీ రాజ్ , పోలీసు విభాగంపై సీఎం సమీక్ష నిర్వహించనున్నారు.

కలెక్టర్ల సదస్సులో సీఎం జగన్

By

Published : Jun 24, 2019, 7:04 PM IST

Updated : Jun 24, 2019, 7:39 PM IST

కలెక్టర్లతో ముఖ్యమంత్రి జగన్ తొలి రోజు సమావేశం ముగిసింది. శాఖల వారీగా కీలక సమీక్షలు చేసిన సీఎం.. ఉన్నతాధికారులకు సంక్షేమ పథకాలపై కీలక ఆదేశాలు ఇచ్చారు. నవరత్నాల హామీల అమలుపై మార్గనిర్దేశం చేశారు. పేదల ఇళ్లు, ఉచిత విద్యుత్, మొక్కల పెంపకం , పశుపోషణపై అధికారులకు ముఖ్య సూచనలు చేశారు.

వేతనాలు పెంపు

పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికుల వేతనాలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రూ. 1800 నుంచి రూ.18 వేలకు పెంచాలని అధికారులను సీఎం ఆదేశించారు.

అర్హులందరికీ ఇళ్లు

అర్హులందరికీ ఇళ్లపట్టాలు ఇవ్వాలన్నది ప్రభుత్వ లక్ష్యమని సీఎం జగన్‌ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల మందికి ఇళ్లపట్టాలు అందిస్తామని హామీఇచ్చారు. ప్రభుత్వ భూమి కొరత ఉంటే కొనుగోలు చేసి లబ్ధిదారులకు ఇస్తామని స్పష్టం చేశారు. పట్టణాల్లో బహుళ అంతస్తుల భవనాలు నిర్మించి పేదవారికి నివాసాలు కల్పిస్తామన్నారు. ఇళ్ల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.లక్షన్నర చొప్పున ఇస్తున్నాయన్న జగన్ గుర్తుచేశారు. గత ప్రభుత్వ హయంలో గృహనిర్మాణాలలో అవకతవకలు జరిగాయని, వాటిపై విచారణ జరుపుతామని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో ఇళ్లు లేని వారు ఉండకూడదనే లక్ష్యంతో పనిచేయాలని కలెక్టర్లకు నిర్దేశం చేశారు. ఏటా 6 లక్షల ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలన్నారు.

9 గంటల ఉచిత విద్యుత్

రైతులందరికీ 9 గంటలపాటు పగటిపూట ఉచిత విద్యుత్‌ సౌకర్యం కల్పిస్తామని సీఎం జగన్‌ కలెక్టర్ల సదస్సులో చెప్పారు. ఇబ్బందులున్న చోట్ల ఫీడర్ల వారీగా ప్రణాళిక ఇవ్వాలని అధికారులను కోరారు. రాష్ట్రంలో 57 వేలకు పైగా పంపుసెట్ల కనెక్షన్ల కొరత ఉందన్న సీఎం.. వాటిని నిర్ణీత సమయానికి పూర్తిచేయాలని కోరారు. రైతులకు ఉచిత విద్యుత్‌ను ప్రాధాన్యత అంశంగా చూడాలని కలెక్టర్లను ఆదేశించారు.

వన్ సిటిజన్.. వన్ ట్రీ

రాష్ట్రంలో ప్రతి పౌరుడూ ఒక మొక్క నాటే సంకల్పం తీసుకోవాలని సీఎం జగన్‌ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా చేపట్టాలని అధికారులను కోరారు. గ్రామవాలంటీర్లను భాగస్వాములు చేయాలన్నారు. పాఠశాలలు, ఆస్పత్రులతో పాటు.. రాష్ట్ర వ్యాప్తంగా 25 కోట్ల మొక్కలు నాటేలా ప్రణాళిక రూపొందాలని ఆదేశించారు. మొక్కల సంరక్షణ బాధ్యతను సీఎస్ఆర్ కింద పరిశ్రమలు తీసుకోవాలన్నారు.

పశుపోషణ

చిన్న గోకులాలకు ఇవ్వాల్సిన రాయితీ సొమ్మును ఏ పార్టీ వారు అని చూడకుండా అందజేయాలని సీఎం తెలిపారు. ప్రతి గొర్రెకు రూ.6 వేల బీమా ఇస్తామని జగన్‌ ప్రకటించారు. పశువులకూ బీమా ఇచ్చేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. పశువైద్యులను అందుబాటులో ఉంచాలన్న సీఎం... వెటర్నరీ ఆస్పత్రుల అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.

ఇదీ చదవండి : సోమవారం మీకోసం కాదు... స్పందన : సీఎం జగన్

Last Updated : Jun 24, 2019, 7:39 PM IST

ABOUT THE AUTHOR

...view details