ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

ఏపీలో వాళ్ల ఆటలు సాగవు: చంద్రబాబు

శ్రీకాకుళం జిల్లాలో పర్యాటకాన్ని ప్రోత్సహిస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. నరసన్నపేటలో ప్రత్యేక ఆర్థిక మండలి ఏర్పాటు చేస్తానన్న సీఎం... మోదీ, జగన్, కేసీఆర్ ఎన్ని కుట్రలు చేసినా ఏపీలో వాళ్ల ఆటలు సాగవని హెచ్చరించారు.

సీఎం చంద్రబాబు

By

Published : Mar 30, 2019, 7:10 PM IST

సీఎం చంద్రబాబు
త్వరలోనే పింఛను 3 వేల రూపాయలు చేస్తానని సీఎం చంద్రబాబునాయుడు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట ఎన్నికల ప్రచారంలో తెలిపారు. నరసన్నపేటలో పేదలకు ఇళ్లు కట్టించే బాధ్యత నాది అని సీఎం హామీ ఇచ్చారు. కోటిమంది చెల్లెళ్లు ఉన్న ఏకైక అన్నయ్యను నేనే అన్న బాబు..వచ్చే ఐదేళ్లలో మూడుసార్లు పసుపు-కుంకుమ ఇస్తానన్నారు.

వంశధార వీరఘట్టం జలాశయం పూర్తి చేశామని తెలిపిన ఆయన...నరసన్నపేటలో ప్రత్యేక ఆర్థిక మండలి ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. మీ అందరి భవిష్యత్తు నా బాధ్యత అని తెలిపిన సీఎం...శ్రీకాకుళం జిల్లాలో నీటిసమస్య లేకుండా చేస్తానని హామీ ఇచ్చారు. నా రాజకీయ జీవితంపై మోదీతో చర్చకు సిద్ధమన్న బాబు.. జగన్‌ ఎన్నికల అఫిడవిట్‌లో 31 కేసులున్నాయని వివరించారు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా ఏపీలో వాళ్ల ఆటలు సాగవని వ్యాఖ్యానించిన సీఎం...కేంద్రంలో మనం చెప్పిన ప్రభుత్వమే రావాలన్నారు. రాష్ట్ర ప్రజలు తెదేపాకే పట్టం కట్టాలని పిలుపునిచ్చారు.

ABOUT THE AUTHOR

...view details