ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

'సాగు లాభసాటే ధ్యేయం' - chandrababu

​​​​​​​'నీరు-ప్రగతి'పై కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. జల సంరక్షణ పనులు వేగవంతం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు

By

Published : Feb 18, 2019, 10:32 AM IST

'నీరు-ప్రగతి'పై కలెక్టర్లు,వివిధ శాఖల అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.నదుల అనుసంధానంతో సత్ఫలితాలు వచ్చాయని...సమర్థ నీటి నిర్వహణతో అధిక దిగుబడులు సాధించామని సీఎం హర్షం వ్యక్తం చేశారు.పోలవరం ప్రాజెక్టు66శాతం పూర్తి చేశామని అన్నారు. 19ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయిందని మరో4ప్రాజెక్టులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయన్నారు.మొత్తం62ప్రాజెక్టుల పనులు శరవేగంగా చేస్తున్నామని వెల్లడించారు.జల సంరక్షణ పనులు వేగవంతం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.వర్షాకాలంలోపు పనులు వేగంగా పూర్తిచేయాలన్నారు.వేసవిలో తాగునీటి ఎద్దడి నివారించాలని...రాబోయే3నెలలు తాగునీటిపై దృష్టి పెట్టాలని సూచించారు.వర్షాభావంలోనూ సాగునీటి కొరత లేకుండా చేశామన్నారు.తాగునీటి కొరత నివారణపై అందరూ దృష్టిపెట్టాలన్నారు.

గ్రామాలు,వార్డుల్లో తాగునీటి రవాణాపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు.వ్యవసాయాన్ని లాభసాటి చేయడమే తమ ధ్యేయమని తెలిపారు.మార్కెటింగ్ సమస్యలు లేకుండా చూడాలని...'అన్నదాతా సుఖీభవ'మార్గదర్శకాలు సిద్ధంగా ఉన్నాయన్నారు.కౌలు రైతులకు, 5ఎకరాలు పైబడిన వారికి ఇస్తున్నామని తెలిపారు.కౌలు రైతులకు రూ.9,654కోట్ల పంట రుణాలు ఇవ్వడం దేశంలోనే రికార్డు అని తెలిపారు. 27లక్షల మంది కౌలురైతులకు ప్రయోజనం చేకూరుతుందని...నరేగాతో పశుగ్రాసం సాగును ప్రోత్సహించాలని అధికారులకు దిశానిర్ధేశం చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details