ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

మోదీకి చంద్రబాబు బహిరంగ లేఖ - AP ELECTIONS 2019

ప్రధాని నరేంద్రమోదీకి సీఎం చంద్రబాబు బహిరంగ లేఖ రాశారు. ఏపీ ప్రజల పక్షాన సమాధానం అంటూ లేఖలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

మోదీకి చంద్రబాబు బహిరంగ లేఖ

By

Published : Mar 30, 2019, 11:22 PM IST

ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు బహిరంగ లేఖ రాశారు. ఆంధ్రుల గౌరవాన్ని కించపర్చేలా నరేంద్రమోదీ చేసిన అహంకార పూరిత వ్యాఖ్యలతో ప్రజలు ఆగ్రహంతో రగిలిపోతున్నారని...లేఖలో పేర్కొన్నారు.

మోదీకి చంద్రబాబు బహిరంగ లేఖ
కర్నూలులో మోదీ చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు మండిపడ్డారు. తెదేపా ఆవిర్భావం నాడే ఆంధ్రుల ఆత్మాభిమానం దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ చెప్పిన అబద్దాలు అత్యంత హేయం, బాధాకరమని ఆవేదన చెందారు. ఏపీ అభివృద్ధిఅస్తమించాలని మోదీ ఆక్రోశించారన్నారు. ఉన్నది లేనట్లు..లేనిది ఉన్నట్లూ..చెప్పడంలో ప్రధాని సిద్ధహస్తుడన్నారు. ఆర్థిక నేరస్థులతో కలిసి ఏపీకీ నమ్మక ద్రోహం చేశారన్నారు. రాష్ట్రాభివృద్ధికి మీరు చేసిన సాయం ఒక్కటి చెప్పండని మోదీని ప్రశ్నించారు. ఆయన ప్రధాన సేవకుడు కాదు..ప్రధాన వంచకుడని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

ఇవీ చదవండి...మోదీ మాటలు కోటలు దాటతాయి..: చంద్రబాబు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details