ఉగాది.. అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించిన సీఎం...తెదేపా పోరాడేది న్యాయం కోసం.. ధర్మం కోసమని స్పష్టం చేశారు. తెదేపా నేతల్ని ఐటీ దాడులతో బెదిరిస్తున్నారని విమర్శించారు. ఒక్కమాట చెప్పకుండా సీఎస్‌ను బదిలీ చేశారన్న సీఎం... నరేంద్రమోదీ నియంతలా తయారయ్యారన్నారు. సీబీఐ, ఈడీ, ఆర్‌బీఐ, అన్ని వ్యవస్థల్ని మోదీ ధ్వంసం చేశారని ఆరోపించిన బాబు..అడ్వాణీ ఎన్ని చెప్పినా మోదీ మారరన్నారు. కోడికత్తి పార్టీని చూసి ఎవరూ పెట్టుబడులు పెట్టరని తెలిపిన సీఎం... యువత, రైతులు, మహిళలు, ఉద్యోగుల భవిష్యత్తు నా బాధ్యత అన్నారు. ఐదేళ్లలో చెప్పిన పనుల కంటే ఎక్కువ పనులు చేశానన్న చంద్రబాబు...కేసులున్న వైకాపా అభ్యర్థులు అవసరమా అని ప్రశ్నించారు.
కేసీఆర్ ఒక్క గిఫ్ట్ ఇస్తే... వంద గిఫ్ట్‌లు ఇస్తా: బాబు - చీమకుర్తి
కేసీఆర్‌తో కలిసి వైకాపా రాష్ట్రానికి అన్యాయం చేస్తుందని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ప్రకాశం జిల్లా చీమకుర్తి ఎన్నికల సభలో మాట్లాడిన సీఎం.. కేసీఆర్ ఒక్క గిఫ్ట్ ఇస్తే నేను వంద గిఫ్ట్‌లు ఇస్తానని బదులిచ్చారు.
చీమకుర్తి ఎన్నికల సభలో సీఎం చంద్రబాబు
రాష్ట్రానికి రావాల్సిన లక్ష కోట్లు కొట్టేసిన వ్యక్తి కేసీఆర్ అని ధ్వజమెత్తిన చంద్రబాబు..కేసీఆర్ 16 ఎంపీ సీట్లు గెలిస్తే.. తెదేపా 25 ఎంపీ, 175 అసెంబ్లీ సీట్లు సొంతం చేసుకుంటుందని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. చీమకుర్తికి రూ.62 కోట్లతో తాగునీటి సదుపాయం కల్పించామన్న సీఎం..చీమకుర్తిలో మైనింగ్ యూనివర్సిటీ వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు.
ఇవీ చూడండి :'తెదేపాను రాజకీయంగా దెబ్బతీసేందుకే కేంద్రం దాడులు'