ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

ప్రతి పేదవాడి సొంతింటి కల నెరవేరుస్తా: చంద్రబాబు - undefined

సమాజంలో సంస్కరణలు తెచ్చిన తొలి నాయకుడు ఎన్టీఆర్‌ అని సీఎం చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న సీఎం...దాదాపు  40 ఏళ్లుగా ప్రజాసేవలో ఉన్న ఏకైక పార్టీ తెదేపా అన్నారు. ప్రతి పేదవాడి సొంతింటి కల నెరవేరుస్తామన్న చంద్రబాబు...పట్టణప్రాంతాల్లోనూ ఉచితంగా ఇళ్లు కట్టించే బాధ్యత తీసుకుంటామన్నారు.

పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారం

By

Published : Mar 29, 2019, 11:34 PM IST

పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారం
పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు ఎన్నికల ప్రచార సభకు హాజరైన చంద్రబాబు..తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన వ్యక్తి ఎన్టీఆర్‌ అని ప్రశంసించారు. అనేక సవాళ్లు ఎదుర్కొని తెలుగుదేశం పార్టీ నిలబడిందన్న సీఎం...సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిన ఘనత తెదేపా సొంతమన్నారు. 55 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మనదే అని తెలిపిన బాబు.. భవిష్యత్తును నిర్దేశించే ఈ ఎన్నికల్లో ఆడపడుచులు అండగా నిలవాలని కోరారు.జగన్‌లా మాయమాటలు చెప్పను అని తెలిపిన సీఎం...బీసీలకు ప్రత్యేక బ్యాంకు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి పేదవాడి సొంతింటి కల నెరవేరుస్తామని హామీ ఇచ్చిన బాబు.. పట్టణ ప్రాంతాల్లోనూ ఉచితంగా ఇళ్లు కట్టించే బాధ్యత తీసుకుంటానని భరోసా ఇచ్చారు. యువతకు గార్డియన్‌గా ఉంటూ...ఉద్యోగాలు వచ్చేలా చూస్తానన్నారు. 31 కేసులున్న జగన్..రాష్ట్రంలో శాంతిభద్రతలు రక్షించగలడా అని ప్రశ్నించాడు. మోదీ రాష్ట్రాన్ని మోసం చేశాడన్న బాబు..అమరావతి, పోలవరం పూర్తి కాకుండా కేసీఆర్ కుట్రలు చేస్తున్నాడని ఆరోపించారు. కొవ్వూరులో వందపడకల ఆస్పత్రి నిర్మిస్తామన్న సీఎం... అభివృద్ధి చేసే తెదేపాకే ఓటు వేయాలని కోరారు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details