పశ్చిమ బంగాలో తృణముల్ కాంగ్రెస్కు మద్దతుగా ప్రచారం చేస్తోన్న చంద్రబాబు...ఆ పార్టీ అధినేత్రి, పశ్చిమ బంగా సీఎం మమతా బెనర్జీ భారత్ బెబ్బులిగా మారే సమయం వచ్చిందని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారం సభల్లో మాట్లాడిన సీఎం చంద్రబాబు మే 23 తర్వాత దేశానికి కొత్త ప్రధాని వస్తారని, కేంద్రంలో భాజపాయేతర ప్రభుత్వం ఏర్పాడుతుందని ధీమావ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో దీదీ కీలకపాత్ర వహిస్తారని చంద్రబాబు వెల్లడించారు. ఈ ప్రచారంలో చంద్రబాబు మోదీపై తీవ్ర విమర్శలు చేశారు.
మోదీపై విమర్శలు
మతాన్ని అడ్డుపెట్టుకొని మోదీ- అమిత్ షా పశ్చిమ బంగాలో విధ్వంసం సృష్టించాలని చూస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. భాజపాకు స్థానమిస్తే మతవిద్వేషాలకు ఆజ్యం పోసినట్టేనని సీఎం అన్నారు. పౌరపట్టిక, పౌరసత్వ సవరణ బిల్లులతో దేశంలో సంక్షోభం సృష్టించడానికి భాజపా ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు. భాజపాయేతర రాష్ట్రలపై కక్షసాధింపు చర్యలు చేస్తోన్న మోదీ ప్రజాస్వామ్య వ్యవస్థను అగౌరవ పరుస్తున్నారని తీవ్ర స్వరంతో విమర్శించారు. ఏపీలో ఆర్థిక నేరగానికి మోదీ-అమిత్ షా అండగా ఉన్నారని చంద్రబాబు అన్నారు.
'ఎన్నికల సంఘం తీరు మారాలి'