కేసీఆర్ తో కలిసి జగన్ నాటకాలు ఆడుతుంటే చూస్తూ ఊరుకోనని ముఖ్యమంత్రి అన్నారు. కేసీఆర్ జీవితమంతా అబద్ధాలేనన్న చంద్రబాబు...ప్రత్యేక హోదా పోరాటంలో పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానం పెడితే కేసీఆర్ ఎందుకు మద్దతు ఇవ్వలేదని ప్రశ్నించారు. సోనియా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామంటే కేసీఆర్ తీవ్రంగా వ్యతిరేకించారని చంద్రబాబు గుర్తుచేశారు. ఏపీకి ఇస్తే తెలంగాణాకు ఇవ్వాలని అడ్డుపడిందని కేసీఆర్ కాదా.. అని సీఎం అన్నారు. మహానాయకుడిలా కేసీఆర్ వ్యవహిస్తున్నారన్నారు.
పోలవరంపై కేసీఆర్ కేసులన్నీ వెనక్కి తీసుకుంటారా: చంద్రబాబు - tdp
పోలవరంపై సుప్రీంలో వేసిన కేసులన్నీ కేసీఆర్ వెనక్కి తీసుకుంటారా అని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేసీఆర్ కేంద్రానికి లేఖ రాస్తారా..ఆ ధైర్యం ఉందా అన్నారు. భద్రాచలం ఏపీకి ఇవ్వాలని చంద్రబాబు కోరారు. కేసీఆర్ ఉండేది మోదీ ఫ్రంటా లేదా ఫెడరల్ ఫ్రంటా అని ఎద్దేవా చేశారు.
రాష్ట్ర ప్రజల ఆనందం కోసమే 5 ఏళ్లు కష్టపడ్డానన్న సీఎం చంద్రబాబు...ప్రతీ ఇంటికీ పెద్దకొడుకుగా ఉంటానని హామీ ఇచ్చారు. రైతు రుణమాఫీ నిధులు బ్యాంకుల్లో వేస్తామన్నారు. పిల్లలను బడికి పంపితే రూ. 18 వేలు అందిస్తామని చంద్రబాబు అన్నారు. ఇంటర్ విద్యార్థులకు ల్యాప్ టాప్ అందిస్తామన్న సీఎం...అధికారంలోకి రాగానే భారీగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని పేర్కొన్నారు.
కృష్ణా జిల్లా పెడన సభలో మాట్లాడిన చంద్రబాబు వైకాపా, తెరాసపై తీవ్రంగా విమర్శలు చేశారు. వైకాపా అధికారంలోకి వస్తే రౌడీయిజం రాజ్యమేలుతుందని చంద్రబాబు ఆరోపించారు. వైకాపా హత్యా రాజకీయాలు చేస్తోందని సీఎం విమర్శించారు. వ్యక్తులను చంపేసి గుండెపోటని చిత్రీకరిస్తారన్నారు.