ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

నేడు పశ్చిమ, రాజధాని జిల్లాలలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం

సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారం నేడు పశ్చిమగోదావరి, కష్ణా-గుంటూరు జిల్లాల్లో జరగనుంది. ప్రచారంలో భాగంగా బహిరంగసభలు, రోడ్డు షోలలో చంద్రబాబు పాల్గొంటారు. సీఎం ప్రచారం సభల ఏర్పాట్లను జిల్లా నాయకులు పరిశీలిస్తున్నారు.

చంద్రబాబు ఎన్నికల ప్రచారం

By

Published : Mar 23, 2019, 6:17 AM IST

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు మూడు జిల్లాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సీఎం ప్రచార సభల్లో పాల్గొంటారు.

చంద్రబాబు ఎన్నికల ప్రచారం

పశ్చిమగోదావరిలో

పశ్చిమగోదావరి జిల్లాలో నిర్వహించే బహిరంగ సభలలో పాల్గొననున్న సీఎం.. పాలకొల్లు, ఆచంట నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు. ఉదయం 10 గంటలకు పాలకొల్లు చేరుకొనున్న ముఖ్యమంత్రి..బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం ఆచంటకు వెళ్తారు. మధ్యాహ్నం ఆచంటలో జరిగే బహిరంగసభలో చంద్రబాబు మాట్లాడతారు. చంద్రబాబు ప్రచారానికి తగిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. పోలీసు బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణపై అధికారులు పర్యవేక్షిస్తున్నారు. జిల్లా తెదేపా నాయకులు బహిరంగసభ ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు.

కృష్ణా-గుంటూరులలో

రాజధాని జిల్లాల్లో.. సీఎం నేడు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. కృష్ణా జిల్లా నాగాయలంక, గుంటూరు జిల్లా రేపల్లె ఎన్నికల ప్రచారసభల్లో చంద్రబాబు పాల్గొంటారు. సాయంత్రం రోడ్డు షోలో ప్రచారం చేస్తారు. అనంతరం మాయబజారు వద్ద జరిగే బహిరంగసభలో సీఎం ప్రసంగిస్తారు.

ఇవీ కూడా చూడండి

500 కోట్లు... 31 కేసులు... ఈసీకి జగన్ లెక్కలు

ABOUT THE AUTHOR

...view details